Sad weather | ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు…

Sad weather | ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు…
Sad weather | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం ఎర్రబాలెంలో విషాదం నెలకొంది. గ్రావెల్ కోసం తవ్విన లోతైన గుంతలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు పడి మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. చిన్నారుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పిల్లల తల్లిదండ్రులు రోదిస్తూ కళ్లముందే జరిగిన ఈ విషాదాన్ని తట్టుకోలేక పోతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రావెల్ తవ్వకాల కారణంగా ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
