మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..

మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..

తీసుకెళితేనే నిజమైన విజయం
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

విజయవాడ రూరల్‌, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో క్లస్టర్ ఇంచార్జిల శిక్షణ తరగతులలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, అదే సమయంలో ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రజలకు నేరుగా వివరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని తెలిపారు.

డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఇకపై అభివృద్ధితో పాటు, తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను దీటుగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. వైసీపీ చేయకూడని పాపాలు చేసి, ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ దుష్ప్రచారాలతో నిండిపోయిందని, తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టండంతో పాటు ఆ వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలదేనని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ కోసం ప్రతి కార్యకర్త చేస్తున్న సేవలు, కష్టాలను మై టీడీపీ యాప్ ద్వారా పార్టీకి తెలియజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో మై టీడీపీ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణ తరగతులు పార్టీని మరింత బలోపేతం చేయడంలో కీలకంగా మారతాయని దేవినేని ఉమా ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply