నియో స్పోర్ట్స్ క్లబ్ లో స్విమ్మింగ్ చేస్తున్న చిన్నారులు..

నియో స్పోర్ట్స్ క్లబ్ లో స్విమ్మింగ్ చేస్తున్న చిన్నారులు..

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ని నియో స్పోర్ట్స్ క్లబ్ లో స్విమ్మింగ్ కోసం పెద్ద ఎత్తున చిన్నారులు, యువకులు, యువతులు వెళ్లి స్విమ్మింగ్ చేస్తూ సేదతీరుతున్నారు. ఒక వైపు ఎండలు దంచి కొడుతుండడం ..మరో వైపు చిన్నారులకు ఉగాది, రంజాన్ సెలవులు రావడంతో యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున స్విమ్మింగ్ పూల్ కు వస్తున్నారు. దాదాపు 30 డిగ్రీల పైన ఎండ ఉండడంతో విద్యార్థులు , యువకులు స్విమ్మింగ్ పూల్ కి వస్తున్నారు.ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల వరకు స్విమ్మింగ్ చేస్తూ భానుడి ప్రతాపం నుండి తప్పించుకొని మరీ ఆహ్లాదకరంగా ,ఆనందంగా గడుపుతున్నారు.

Leave a Reply