నిరుపేదలకు అండ సీఎం సహాయనిధి..

నిరుపేదలకు అండ సీఎం సహాయనిధి..
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు,
చిట్యాలలో 66 మంది లబ్ధిదారులకు..రూ18. 23 లక్షల చెక్కుల పంపిణీ,
చిట్యాల, ఆంధ్రప్రభ : నిరుపేదలకు సీఎం సహాయనిధి కొండంత అండ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం,మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, మండలంలోని పలు గ్రామాలకు చెందిన 66 మంది లబ్ధిదారులకు రూ 18 లక్షల ఇరవై రెండు వేల సీఎంఆర్ ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో , ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో హాస్పటల్లో ఖర్చు కోసం సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రమాదాల బారిన, అత్యవసర వైద్య చికిత్సల కోసం నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిందని, అర్హులైన ప్రతి ఒక్కరు సీఎం సహాయనిధి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సర్పంచులు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
