రెడీ మిక్స్ రేట్ల పెంపుతో అభివృద్ధి పనులకు అడ్డంకులు

రెడీ మిక్స్ రేట్ల పెంపుతో అభివృద్ధి పనులకు అడ్డంకులు
- సరఫరాదారుల ఇష్టారాజ్యం…నియంత్రణ ఎక్కడ?
- అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమాలకు ఆస్కారం
- రేట్ల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలి
- నాణ్యత పరీక్షలు కఠినంగా అమలు చేయాలనే డిమాండ్
- అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
- స్టేషన్ ఘన్ పూర్ లో పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్రహం
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో రెడీ మిక్స్ కాంక్రీట్ సరఫరా వ్యవహారం తీవ్ర సమస్యగా మారు తోంది. ఎలాంటి అధికారిక మార్గదర్శకాలు లేకుండా సరఫరాదారులు ఇష్టానూసారంగా రేట్లు పెంచుతూ ప్రజలపై అదనపు భారం మోపుతు న్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో నాణ్యతలేని మెటీరియల్ సరఫరా చేస్తున్నారని, రెడీ మిక్స్‌లో అధికం గా డస్ట్ కలుపుతూ ప్రమాణాలను తుంగలో తొక్కుతున్నారని పలు వురు ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. కాగా సరఫరాకు ముందే మొత్తం పైసలు చెల్లిస్తేనే కాంక్రీట్ పోస్తామని షరతులు విధించడం వల్ల చిన్న కాంట్రాక్టర్లు, గ్రామపంచాయతీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నాయి.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడమే
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడంతోనే ఈ అక్ర మాలకు ఆస్కారం లభిస్తోందని పలువురు స్థానికులు వాపోతున్నారు. రేట్ల నియంత్రణ, నాణ్యత పరీక్షలు సక్రమంగా జరగకపోవడం వల్ల ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించినా నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి కంటే ఈ ఖర్చులే ఎక్కువగా కనిపిస్తు న్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రెడీ మిక్స్ రేట్లపై నియంత్రణ విధించాలి. నాణ్యత ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని పలువురు ప్రజాప్రతిని ధులు కోరుతున్నారు. అలాగే అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
