ఏంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ….
నర్సంపేట, ఆంధ్రప్రభ : పసిపిల్లల విక్రయ కేసులో మహిళా సబ్ జైలులో ఉన్న ఖైదీ తాడూరి కల్పన (42) మృతి చెందారు. కరీంనగర్ జిల్లా కోతి రాంపూర్ గ్రామానికి చెందిన తాడూరి కల్పన మహిళా పసిపిల్లల కొనుగోలు అమ్మకాల విషయంలో చెన్నారావుపేట పోలీసులు అరెస్టు చేశారు.
గత నెల 25న నర్సంపేట మహిళా సబ్ జైలు కు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో నర్సంపేట సబ్ జైలు సిబ్బంది నర్సంపేట ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎం కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మరణించినట్లు తెలిసింది.
