మార్మోగిన శివ‌నామ‌స్మ‌ర‌ణ‌

మార్మోగిన శివ‌నామ‌స్మ‌ర‌ణ‌

మార్మోగిన శివ‌నామ‌స్మ‌ర‌ణ‌

నర్సంపేట నవంబర్ ( ఆంధ్రప్రభ) : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శివాంజనేయ దేవాలయంలో కార్తీక పూజలను ఘ‌నంగా బుధవారం నిర్వహించారు. మాదన్నపేట చెరువు కట్టపై ఉన్న రామలింగేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష ఒత్తుల పూజలు నిర్వహించారు. పాలాభిషేకం, పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామునుండే వేలాది మంది భక్తులు కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు.

దీంతో కార్తీక మాసం కార్తీక పూజలతో దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. శివాంజనేయ దేవాలయం లో ఉసిరిచెట్టుకు మహిళలు పూజలు నిర్వహించారు. నర్సంపేట డివిజన్ లోని వివిధ దేవాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.నల్లబెల్లి మండలంలోని గుండ్లపహాడ్ శివాలయం, చెన్నారావుపేట మండలం లింగగిరి చెన్నకేశవ దేవాలయం లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply