వేదిక ప్రాంగణం వితరణ..

వేదిక ప్రాంగణం వితరణ..
ములకలపల్లి, ఆంధ్రప్రభ : కి “శే ” తాండ్ర చంద్రమ్మ మరియు తాండ్ర సుదర్శనరావు జ్ఞపాకర్థంగా ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామంలోని ఎంపియూపిఎస్ పాఠశాలకు వేదిక ప్రాంగణంను వితరణ చేసినా జలగం లీలా సంతోష్ కుమార్. వేదిక ప్రాంగణంను ప్రారంభించిన సర్పంచ్ తుర్రం శ్రీనివాసరావు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల అవసరాన్ని గుర్తించిన జలగం లీలా సంతోష్ కుమార్ కి “శే ” తాండ్ర చంద్రమ్మ మరియు తాండ్ర సుదర్శన్ రావు జ్ఞపాకర్థం గా సుమారు లక్ష రూపాయల ఖర్చుతో “పాఠశాల వేదిక ప్రాంగణం “ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రధానోపాధ్యాయులు బి శంకర్ మాట్లాడుతూ ఈ వేదిక ప్రాంగణం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని , అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని తెలియజేసినారు. ఈ కార్యక్రమం లో తల్లిదండ్రులు, గోపి, గుడ్ సేఫర్డ్ సభ్యులు ఉదయ్, విద్యాసాగర్, ఉపాధ్యాయులు నిర్మల, సురేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
