మైనార్టీ సంక్షేమానికి కృషి చేస్తా : మంత్రి వివేక్

మైనార్టీ సంక్షేమానికి కృషి చేస్తా : మంత్రి వివేక్
చెన్నూర్, ఆంధ్రప్రభ : నియోజకవర్గ మైనార్టీ సంక్షేమానికి తనవంతు కృషి ఉంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బక్రీద్ వేడుకలను చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ముస్లీం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి స్థానిక ఈద్గా వద్ద ముస్లీం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులతో కృషి చేస్తామన్నారు. పట్టణంలో కమ్యూనిటీ హల్, కబారాస్థాన్, తదితర అభివృద్ధి కార్యక్రమాలు తన హయాంలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలు పండుగ వేడుకలను కలిసి మెలిసి కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని సందేశాన్ని ఇచ్చారు. అనంతరం ముస్లిం పెద్దల ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలిపారు.
