ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్….

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్….
దండేపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99రోజుల ప్రజ పాలన ప్రణాలికను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత ఆదేశానుసారము దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం వైద్య శిబిరాన్నిస్థానిక సర్పంచ్ రాజేశ్వర్ నాయక్ మాజీ ఎంపిటిసి, ముత్యాల శ్రీనివాస్ ప్రాంభించారు, ఈ దండేపల్లి చుట్టూ గ్రామ ప్రజలు 72 రకాలకు సంబంధించిన వైద్యం చేయించుకున్నారు.
శిబిరములలో డాక్టర్ పవన్ డాక్టర్ ఆదిత్య డాక్టర్ డాక్టర్ షబ్బీర్, డాక్టర్ లక్ష్మీ శ్రీ డాక్టర్ పల్లవి స్పెషలిస్ట్ వైద్యులు మాతా శిశు సంరక్షణ జనరల్ మెడిసిన్ స్త్రీ సంబంధ వ్యాధులు ఆర్తో చిన్నపిల్లల వైద్యులు కంటికి సంబంధించిన వైద్యులు పంటికి సంబంధించిన వైద్యుల ద్వారా 152 మందికి చికిత్సలుచికిత్సలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రత్యేక వైద్య శిబిరంలో పాల్గొని సంతృప్తి వ్యక్తం చేసినారు దీని ద్వారా జిల్లా ఆసుపత్రిలో లభించే ప్రత్యేక వైద్యుల నిపుణులచే జరుగు సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరకు అందించడంతో సంతోషం వ్యక్తం చేశారు,ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్, ఆశ వర్కర్లు, సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
