మత్తు పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు

మత్తు పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు
- ఎస్ఐ సాయి కిరణ్ హెచ్చరిక
కడెం, ఏప్రిల్ 7 (ఆంధ్రప్రభ): మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి. సాయి కిరణ్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిలా ఆదేశాల మేరకు ‘గంజా గస్తీ – సే నో టు గంజా’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కడెం మండలం కొండుకూర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువకులకు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై వివరించారు.
అదే విధంగా కిరాణా దుకాణాలు, పాన్ డబ్బాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలు విక్రయించరాదని, నిషేధిత పదార్థాల విక్రయంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కడెం పోలీస్ స్టేషన్ సిబ్బంది వెడమ భీమ్ రావు, వంశీ నేరేళ్ల, గొల్ల శ్రీనివాస్, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
