ఎస్ ఐ ఆర్ ఓటర్ సర్వేకు సహకరించాలి…
నర్సాపూర్ సర్పంచ్ డీఎస్ సంగీత
కడెం, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) సర్వేకు గ్రామ ప్రజలు, ఓటర్లు పూర్తి సహకారం అందించాలని నర్సాపూర్ గ్రామ సర్పంచ్ డి.ఎస్. సంగీత రాజేష్ పిలుపునిచ్చారు. కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ఓటరు పరిశీలన సర్వేలో సర్పంచ్ డి.ఎస్. సంగీత రాజేష్ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటా నిర్వహిస్తున్న సర్వేలో బీఎల్‌ఓ భూపేందర్ కౌర్‌తో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలను పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని నమోదు చేసే ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారు. ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమానికి ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని ఆమె కోరారు.
