ప్రజా పాలనలో-ప్రగతి ప్రణాళిక..

ప్రజా పాలనలో-ప్రగతి ప్రణాళిక..
వెల్దండ, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రజా పాలన ప్రగతిలో భాగంగా వెల్దండ మండల కేంద్రంలోని ఆదివారం 3వ రోజు సందర్బంగా ఇంటింటికి తడి చెత్త,పొడి డబ్బులను అందజేసినట్టు సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకట గౌడ్, ఉప సర్పంచ్ శ్రీను అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తడి చెత్త పొడి చెత్త ను వేరుచేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్ సిబ్బందికి అందించాలని అన్నారు.ఇదే సందర్బంగా సెగ్రీగేషన్ షెడ్ సందర్శించి సేంద్రియ ఎరువుల తయారీ విధానంపై చర్చించారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, మరియు వార్డు మెంబర్స్ గోసులు కొండయ్య, పాలది రంగనాథం,గుద్దటి కిస్ట్రల్,రేవల్లి రాజు,మారేపల్లి శ్రీను,ముదికొండ రమేష్,మసిగుండ్ల వెంకటేష్, బాదేపల్లి రమేష్, శేఖర్, ఈదులపల్లి వెంకటయ్య ,కార్యదర్శి గిరి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
