Students | ఘనంగా సైన్స్ దినోత్సవం

Students | ఘనంగా సైన్స్ దినోత్సవం

Students | తిర్యాణి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం రోజున జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిధులుగా జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్ మాట్లాడుతూ పరిశీలన అభివృద్ధి ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెరిగి భవిష్యత్తులో సైంటిస్టులుగా ఎదుగుతారని అన్నారు.

అనంతరం మండల విద్యాధికారి అంజయ్య మాట్లాడుతూ సైన్స్ అనేది నిత్యజీవితంలో భాగమని, విద్యార్థులు సరైన దృక్పథం ఏర్పాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో రాణించడం ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. పాఠశాల సైన్సు ఉపాధ్యాయుని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అమరేందర్ సోమశేఖర్ వెంకటేశ్వరరావు, మంజుల,తిరుపతి,దత్తు, వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు, లెనిన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply