మార్చ్ 2న కౌలాస్ లో ఉర్స్, కామదహన కార్యక్రమం..

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన సైలని గుట్టలో కొలువుదీరిన హజ్రత్ సైలానిబాబ(దార్గ)ఉర్స్ ఉత్సవాలు, కామదహన కార్యక్రమం మార్చి రెండున సోమవారం నిర్వహించడం జరుగుతుందని దర్గా నిర్వాహకులు పిర్ ముర్షిద్ షేక్ ఐనుల్లాషాఖాద్రి(అహ్మద్ ఆర్టిసి)తెలిపారు. సోమవారం సాయంత్రం కౌలాస్ గ్రామం నుండి షేక్ అబ్దుల్లాషా ఖాద్రి, షేక్ మోహియోద్దీన్ షా ఖాద్రితో కల్సి ఊరేగింపుగా సందల్ ను హజ్రత్ సైలానిబాబ దర్గా వరకు తీసుకోరవటం జరుగుతుందన్నారు. దింతో పాటు హొలీ కామదహన కార్యక్రమం, అన్నదానం తోపాటు హజ్రత్ సైలాని బాబా దర్గావద్ద అదేరోజు రాత్రి ఖవ్వాలి కార్యక్రమం ఉంటుందని.. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా కులమతాలకతీతంగా భక్తులు, శిష్యులు, ప్రజలు అత్యధికంగా సంఖ్యలో పాల్గోని కామదహన, ఉర్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
