రాష్ట్ర స్థాయికి పోచంపాడ్ విద్యార్థులు
మెండోరా, ఆంధ్రప్రభ: నిజామాబాద్ డీఎస్‌ఏ గ్రౌండ్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-14 బాలుర అత్య-పత్య ఎంపికల్లో మెండోరా మండలం పోచంపాడ్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ ఎంపికల్లో పాల్గొన్న దిల్‌వార్, రిషివర్ధన్, నిహాల్, సుందర్, నిక్షిత్ అద్భుత ఆటతీరుతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ వి. మహిపాల్‌రెడ్డి తెలిపారు.
ఈ నెల 11, 12 తేదీల్లో సిద్ధిపేటలో జరిగే రాష్ట్ర స్థాయి అత్య-పత్య పోటీల్లో ఈ ఐదుగురు విద్యార్థులు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ మహిపాల్‌రెడ్డి, దూద్‌గాం సర్పంచ్ బాబా అభినందించారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించిన పీఈటీ సంజీవ్‌ను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు.
