MLA | అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే..
MLA | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మంగళవారం జరిగిన అంత్యక్రియల్లో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు. గ్రామానికి చెందిన గంగారెడ్డి మాతృమూర్తి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గోవర్ధన్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. గోవర్ధన్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు ఉన్నారు.
