టీడీపీ గూటికి..

టీడీపీ గూటికి..
విజయవాడ, ఆంధ్రప్రభ : తిరువూరు టీడీపీ టౌన్ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తిరువూరు పట్టణానికి చెందిన వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రామడుగు రామకోట చారి (ఆర్.ఆర్.కె. చారి), గీతం స్కూల్ కరస్పాండెంట్ గీతమ్స్ చారి ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు టీడీపీ టౌన్ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాసరావు, బీసీ సెల్ నాయకులు కందిమళ్ల శేషగిరిరావు, టీడీపీ నాయకులు మాదల హరిచరణ్ (కిట్టు), మోదుగ వెంకటేశ్వరరావు, యండ్రాతి కిరణ్, తూళ్లురి అనిల్, తాళ్లూరి వెంకటేశ్వరరావు, చిన్న జమలయ్య, షేక్ హుస్సెన్, షేక్ ఉమర్, కందిమళ్ల సాయి సునీల్, టీడీపీ మహిళ నాయకులు మాధవిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
