ఇబ్రహీంపట్నంలో డ్రగ్స్ పై దండయాత్ర 2.O

ఇబ్రహీంపట్నంలో డ్రగ్స్ పై దండయాత్ర 2.O

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : గంజాయి ఇతర మత్తు పదార్థాలు సరఫరా చేసే వారి పై ప్రత్యేక నిఘా ఉంచి అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఏడీసీపీ జి.రామకృష్ణ తెలిపారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఏడీసీపీ రామకృష్ణ పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం ముత్తవరపు కళ్యాణ మండపంలో శనివారం రాత్రి డ్రగ్స్ పై దండయాత్ర 2.O కార్యక్రమం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంతాల్లో మత్తుపదార్థాలు సేవిస్తున్న వారి పై దృష్టి పెట్టి వారికి పరీక్షలు చేశారు. ఇందులో భాగంగా 95 మందికి పరీక్షలు చేయగా 25 మందికి పాజిటివ్ వచ్చింది.

ఈ సందర్భంగా ఏడీసీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు సేవిస్తున్న వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ జోన్ ఏసీపీ దుర్గారావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎ.సుబ్రహ్మణ్యం, ఎస్సైలు శ్రీనివాసరావు, బి.రాజు, రవివర్మ, చక్రధర్, సత్యవతి, ప్రభుత్వ మెడికల్ టెస్ట్ ల్యాబ్ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply