3వ రోజు నివాళులు

3వ రోజు నివాళులు

ఘంటసాల, ఆంధ్ర‌ప్ర‌భ : ఘంటసాల మండల పరిధిలోని పూషడం గ్రామంలో మాజీ మంత్రి దివంగత మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండలి వెంకటకృష్ణారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూషడం గ్రామ సర్పంచ్ అంకం మారుతీ రావు మాట్లాడుతూ దివిసీమ ఉప్పెన విషాదం నుంచి వేలాదిమంది అన్నార్తులకు అండగా నిలబడిన మహనీయుడు వెంకట కృష్ణారావు అని తెలిపారు.

ప్రజా సంక్షేమం కోసం తన పదవిని సైతం పక్కనపెట్టిన మంచి వ్యక్తి వెంకటకృష్ణా రావు అని కొనియాడుతూ ఆయన ప్రజలకు అందించిన సేవలు ఎనలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్లా పాము, చీదేపూడి శ్రీనివాసరావు, సింగూలూరి సోంబాబు, గళ్ళ బిరాగి, చీడపూడి అనిల్, కటారి వెంకట రత్నం, కటారి రాంబాబు, గళ్ళ రాధాకృష్ణ, అంకం అదిశేషు,బీమా రాఘవరావు, గల్లా మోహన్, దాసరి శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply