నంద్యాల జిల్లా వలవల

నంద్యాల జిల్లా వలవల

  • హరివరం వీధుల్లో వాన వరద
  • కుందూ నది ఉగ్ర రూపం

నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో గురువాం భారీ వర్షాలతో(With heavy rains) నదులు పొంగిపొర్లుతున్నాయి. కుందూ నది పొంగి ప్రవహిస్తోంది. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో గురువారం తెల్లవారుజామున(Early in the morning, ) భారీ వర్షం కురిసింది. కుందూ నది పక్కనే ఉన్నహరివరం అనే గ్రామం లో వర్షపు నీటితో వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి.

ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. నిత్యావసర సరుకలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి(into houses) నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ళ ముందు నదిలా నీరు ప్రవహించటంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ఉన్నారు. కుందూ నది పరివాహక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కుందూ నది పొంగి ప్రవహిస్తుండటంతో ఆళ్లగడ్డ మాయలురు(Allagadda mayaluru) మధ్యలో ఉన్నబ్రిడ్జిపై(on the bridge) నీరు మూడు అడుగుల ప్రవహించటంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి.

బ్రిడ్జి దగ్గర పోలీసులు రెవెన్యూ సిబ్బంది కాపలాగా ఉన్నారు. ఏగువ ప్రాంతాల్లో కురుస్తున్నభారీ వర్షాలకు కుందూ ఉన్నది ఉధృతంగా(hot) ప్రవహిస్తోంది. మండల తాహసిల్దారు, ఎంపీడీవో, సంబంధిత అధికారులు గ్రామంలో పర్యటించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని, వారికి భోజన వసతి తగిన సౌకర్యాలతో పాటు పలు జాగ్రత్తలు(precautions) తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.

స్థానిక ప్రజలు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి( Baireddy) శబరికి వీడియో కాల్ ద్వారా విషయాన్నితెలిపారు. ఆమె స్పందించి అధికారుల(officials)ను వెంటనే అక్కడికి పంపించారు. తన సిబ్బందిని కూడా పంపించి ప్రజలను ఆదుకోవాలని ఆదేశించారు.

Leave a Reply