అచ్చంపేటలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు..

అచ్చంపేటలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు..

పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పిలుపు
ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట,ఆంధ్రప్రభః అచ్చంపేట పట్టణంలో నిర్వహించనున్న శ్రీ సంతు సేవాలాల్ జయంతి కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి బంజారా సోదరులందరూ పార్టీలకు అతీతంగా తరలిరావాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపునిచ్చారు. అచ్చంపేట నియోజకవర్గ గిరిజన బంజారా సోదరులందరికీ శ్రీ సంతు సేవాలాల్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వీడియో సందేశంలో తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవనున్నట్లు తెలిపారు. బంజారా సమాజానికి ఆదర్శప్రాయుడైన శ్రీ సంతు సేవాలాల్ గారి చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ ఐక్యత, సామరస్యాన్ని చాటేలా ఈ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు.

Leave a Reply