నాలుగు నెలల జీతాలు వెంటనే చెల్లించాలి..

నాలుగు నెలల జీతాలు వెంటనే చెల్లించాలి..

  • అచ్చంపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట జీపీ కార్మికుల ధర్నా

అచ్చంపేట, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ కార్మికులకు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జీపీ కార్మికులు సోమవారం అచ్చంపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. శంకర్ నాయక్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ బడ్జెట్ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలని కోరారు. అలాగే మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి, కనీస వేతనం రూ.26 వేలుగా అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, రూ.20 లక్షల ప్రమాద బీమా అందించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.