వెలుగుమట్ల నారాయణ కాలేజీలో దారుణం..

వెలుగుమట్ల నారాయణ కాలేజీలో దారుణం..

  • తోటి విద్యార్థిపై మత్తు దాడి
  • విద్యార్థి తీవ్ర గాయాలు

ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ: ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన దాడి సంఘటన కలకలం రేపింది. గంజాయి, డ్రగ్స్ మత్తులో ఉన్న కొంతమంది విద్యార్థులు తోటి విద్యార్థి మామిడాల విశాల్‌పై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం విశాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కళాశాలలో మత్తు పదార్థాల వినియోగం జరుగుతోందని, విద్యార్థుల మధ్య గొడవలు సర్వసాధారణమైపోయాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

సంఘటన జరిగిన సమయంలో ఏజీఎం, ప్రిన్సిపల్, వార్డెన్ లేదా ఇతర బాధ్యులు ఎవరూ అక్కడ లేరని సమాచారం. దీనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాల్ తల్లిదండ్రులు కళాశాల నిర్వాహకులను నిలదీయగా తగిన సమాధానం లభించలేదని తెలిపారు. భారీ ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ విద్యార్థుల భద్రతపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Leave a Reply