మధిర మున్సిపల్ కమిషనర్ గా సామ్యూల్

మధిర టౌన్, ఆంధ్రప్రభ : మధిర మున్సిపల్ కమిషనర్ గా సామ్యూల్ బెనటిక్ ఇజ్రాయిల్ పాల్ ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మధిర మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన సంపత్ కుమార్ సాధారణ బదిలీల్లో భాగంగా మల్కాజిగిరి కార్పొరేషన్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గ్రూప్ వన్ అధికారిగా ఉన్న సామ్యూల్ ను మధిర మున్సిపల్ కమిషనర్ గా నియమించారు.