తాడిగడప శ్రీ కృష్ణవేణి కళాశాలలో జాబ్ మేళా

తాడిగడప శ్రీ కృష్ణవేణి కళాశాలలో జాబ్ మేళా

ఈనెల 21న తాడిగడప లోని శ్రీ కృష్ణవేణి డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డా. పి.నరేష్ కుమార్

పెనమలూరు,ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను 21వ తేదీ ఉదయం 9 గంటలకు పెనమలూరు నియోజకవర్గంలోని తాడిగడప-పోరంకి 100 అడుగల రోడ్ నందు గల శ్రీ కృష్ణవేణి డిగ్రీ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డా. పి.నరేష్ కుమార్ తెలియజేశారు.

ఈ జాబ్ మేళాలో కియా ఇండియా, ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్, హెటురో ల్యాబ్స్, టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, డామినీర్ ఇంటీరియర్స్, ఆస్ట్రాజెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారత్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, బిగ్ సి మొబైల్స్, బజాజ్ క్యాపిటల్, సంతోష్ ఆటోమోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, జస్ట్ డయల్ లిమిటెడ్, ఎబిసిపాండా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి 16కు పైగా ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని తెలిపారు.

ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్ ,పిజి పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనము,ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, ఫిబ్రవరి 21న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in వెబ్సైట్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫారంలతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్,సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 7981368429, 8885159008, 9676708041 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply