54 people | పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత కంటి పరీక్షా శిబిరం

54 people | పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత కంటి పరీక్షా శిబిరం
54 people | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లా లోని ఉరవకొండ మండలంలోని చిన్న ముష్టూర్ గ్రామం వద్ద ఉన్న, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు, సిబ్బందికి ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 54 మంది విద్యార్థులకు, కళాశాల సిబ్బందికి, కంటి పరీక్షలు నిర్వహించారు. ఆప్టోమెట్రిస్ట్ కిషోర్, హెల్త్ అసిస్టెంట్ నిమ్మల వెంకటేష్ లు దృష్టి లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.
అవసరమైన వారు నాణ్యమైన కళ్ళజోడులను ధరించాలని, కంటి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అశ్రీఫ్ అలీ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించడం వల్ల వారి విద్యా సామర్థ్యం మెరుగుపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ వెంకటేష్ నాయక్, కెమిస్ట్రీ అధ్యాపకులు సుబ్బ రాయుడు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
