Railway | ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు…

Railway | ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు…

Railway | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జీటీ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన మహారాష్ట్రలోని వార్ధా-సింధి రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే యంత్రాంగం వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా తరలించింది.

పార్శిల్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు మొదలయ్యాయని, కారణం ఇంకా తెలియరాలేదని సమాచారం. ప్రాథమికంగా ఎవరికీ గాయాలు కాలేదని, వైద్యులు, అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని రైల్వే యంత్రాంగం తెలిపింది.

Leave a Reply