Chairman | చైర్పర్సన్ స్వాతి రమేష్‌కు దళిత సంఘాల అభినందనలు

Chairman | చైర్పర్సన్ స్వాతి రమేష్‌కు దళిత సంఘాల అభినందనలు
Chairman | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన దావ స్వాతి రమేష్‌ను దళిత సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఆమెను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పట్టణ అభివృద్ధిలో దళితుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని, ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో బెల్లంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని నాయకులు కోరారు. చైర్‌పర్సన్‌ను కలిసిన వారిలో దళిత సంఘాల అధ్యక్షుడు కుంభాల రాజేష్, అధికార ప్రతినిధి కాసర్ల యాదగిరి, యూత్ సెక్రటరీ నారా సంపత్ తదితరులు ఉన్నారు.
