Congress | తొలి ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా అనురాధ..

Congress | తొలి ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా అనురాధ..

  • కౌన్సిల్ కి రాకముందే.. కాంగ్రెస్ లో చేరిక
  • నేడు ప్రమాణ స్వీకారం..

Congress, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 12 స్థానాలకు గాను నాడు బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో 8 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ గెలుపొందగా.. ఒక్క స్థానంలో (5వ వార్డ్) ఇండిపెండెంట్ అభ్యర్థి మొగుళ్ళ అనురాధ గెలిచింది. మోత్కూర్ మున్సిపాలిటీలోనే తొలి ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా గెలుపొందిన అనురాధ పేరు మున్సిపల్ చరిత్రలో నిలిచిపోనుంది కానీ.. ప్రమాణస్వీకారం కాక ముందే.. కౌన్సిల్ సమావేశానికి రాక ముందే 5వ వార్డ్ అభివృద్ధి కాంక్షించి.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆంధ్రప్రభ ప్రతినిధితో తెలియచేశారు. ఎట్టకేలకు అనురాధ చేరికతో కాంగ్రెస్ మెజార్టీ కౌన్సిలర్ల సంఖ్య కాస్త 9కి చేరింది.

Leave a Reply