రూ.124 కోట్లతో ధర్మారెడ్డి కాలువకు పునర్జీవం

  • 17న ధర్మారెడ్డి పెళ్లి కాలువకు నీళ్లు విడుదల
  • ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

వలిగొండ, ఆంధ్రప్రభ : భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ మండలం సంగెం–ధర్మారెడ్డిపల్లి–గోకారం గ్రామాల పరిధిలో రూ.124 కోట్ల వ్యయంతో చేపట్టిన ధర్మారెడ్డి కాలువ అభివృద్ధి పనులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం కాలువ పురోగతి, వెడల్పు, లోతు, నీటి ప్రవాహం, పక్కన నిర్మిస్తున్న రహదారిని చూసి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాలువ శిథిలమై రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 124 కోట్లు మంజూరు చేసి కాలువను ఆధునిక పద్ధతిలో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పనులతో సంగెం, ధర్మారెడ్డిపల్లి, గోకారం, వర్కట్‌పల్లి గ్రామాలతో పాటు నకరికల్లు నియోజకవర్గం లో అనేక గ్రామాలకు వేల ఎకరాలకు శాశ్వత సాగునీరు అందుతుందని, వ్యవసాయ ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయంమెరుగుపడుతుందని అన్నారు.

ఈ నెల 17న కాలువ నీరు విడుదల..

ఈనెల 17న ధర్మారెడ్డి కాలువలో నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనలో భాగంగా సంగెం వద్ద ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీతో బ్రిడ్జి మంజూరైనట్లు కూడా తెలిపారు. పనులు కూడా మొదలవుతున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని సహదేవ్ మాజీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజు కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్ రెడ్డి, బాత్ రాజు బాల నరసింహ, సంజీవరెడ్డి గుండు దానయ్య గూడూరు శివశాంత్ రెడ్డి,బత్తిని లింగయ్య, కొండూరు సాయి, కాసుల వెంకన్న జక్క జంగారెడ్డి చిలుకూరి సత్తిరెడ్డి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.