అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
- ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
- మహిళ పరిస్థితి విషమం
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట–శ్రీశైలం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. అచ్చంపేట ఎస్‌ఐ కే. సద్దాం తెలిపిన వివరాల ప్రకారం, నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బోల్ఘట్‌పల్లి గ్రామంలోని చంద్రసాగర్ వంతెన సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. అచ్చంపేట డిపోకు చెందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సు (నంబర్: టీజీ 31 జడ్ 0057) ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మహంకాళి మహేష్ (30, సికింద్రాబాద్) అక్కడికక్కడే మృతి చెందాడు. పల్లవి (23, వటువర్లపల్లి) తీవ్రంగా గాయపడగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నాగర్‌కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌ఐ కే. సద్దాం తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

