వెంకటాపురం పొలాల్లో వ్యక్తి అనుమానాస్పద మృతి
వెంకటాపురం పొలాల్లో వ్యక్తి అనుమానాస్పద మృతి
హత్యా..? సహజ మరణమా..? కోణాల్లో దర్యాప్తు
డోన్, ఆంధ్రప్రభ : డోన్ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతుడు గ్రామానికి చెందిన భూపాల్గా గుర్తించారు. మంగళవారం రాత్రి పొలాల్లో ఆయన మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే డోన్ సీఐ సి.ఎం. రాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సంఘటనా స్థలంలోని ఆనవాళ్లను పరిశీలించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
భూపాల్ను ఎవరైనా హత్య చేశారా..? లేక ఇతర కారణాలతో మృతి చెందాడా..? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరిస్తూ ఘటన వెనుక ఉన్న కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

