Selfies | రామేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

Selfies | రామేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

Selfies |తోట్లవల్లూరు – ఆంధ్రప్రభ : తోట్లవల్లూరు మండలంలో దక్షిణకాశీగా పిలవబడే ఐలూరు గ్రామంలో రామేశ్వర స్వామిని మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ పాల్గొన్నారు.

మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా భక్తుల రద్దీ ఉండటం వల్ల వాహనం దిగి నడుచుకుంటూ భక్తులను పలకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ, దర్శనానికి వచ్చిన భక్తులతో కాసేపు సరదాగా గడపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply