11th rank | సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధకులు….
11th rank | సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధకులు….
11th rank | చల్లపల్లి – ఆంధ్రప్రభ : సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధకునిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నియోజకవర్గాన్ని జిల్లాలో మొదటి ర్యాంకులో నిలపటం గర్వకారణం అని వైస్ ఎంపీపీ, టీడీపీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు అన్నారు. నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం చల్లపల్లిలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చిత్రపటానికి టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా రాంబాబు, శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ప్రకటించిన తాజా ర్యాంకుల్లో తమ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఏ-గ్రేడ్ జిల్లా మొదటి ర్యాంక్, స్టేట్ 11వ ర్యాంక్ సాధించటం నియోజకవర్గ ప్రగతికి ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకూ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తన అపార అనుభవంతో నిధులు సాధిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. గెలిచిన వెంటనే రైతుల కోసం పంట కాలువలు, మురుగు కాలువలు బాగు చేయించి, దాదాపు అన్నిటికీ నూతన గేట్లు ఏర్పాటు చేసి సాగు సమయంలో నీటి కొరత, విపత్తుల సమయంలో ముంపు సమస్య తలెత్తకుండా చేశారని తెలిపారు.
ఆముదార్లంక సహా అన్ని వరద ప్రభావిత గ్రామాల్లో నూరు శాతం సీసీ రోడ్లు నిర్మించి వరదల సమయంలో ముంపు తగ్గించటంతో పాటు సకాలంలో సురక్షితంగా పునరావాస కేంద్రాలకు చేరుకునే అవకాశం కలిగించారని తెలిపారు. నియోజకవర్గ రైతులకు యూరియా సరఫరాలో ప్రత్యేక శ్రద్ధ వహించి అధికారులను, సొసైటీ చైర్మన్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల్లో నూరు శాతం స్కోర్ సాధించటం రైతులకు ఆయన చేసిన సేవకు నిదర్శనం అన్నారు.
నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా 500లకు పైగా సీసీ రోడ్లు నిర్మించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చల్లపల్లి మండలంలో నూతన హైవే కనెక్టివిటీ రోడ్డుగా రామానగరం క్లబ్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించటంతో పాటు, సమీపంలోని దేవరకోట – ఘంటసాల రోడ్డు సహా నియోజకవర్గంలో ఇంకా అనేక ప్రధాన రహదారులను నిర్మిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పయనింప చేస్తున్న ఘనత బుద్ధప్రసాదుకే దక్కుతుందన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టే ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని నడిపిస్తున్నారని తెలిపారు. తాజాగా సీఎం చంద్రబాబుతో జరిగిన కృష్ణా జిల్లా ఎమ్మెల్యేల సమావేశంలో పులిగడ్డ- విజయవాడ కరకట్ట రోడ్డు అభివృద్ధికి నిధుల మంజూరుకు కృషి చేయటం శుభ పరిణామం అన్నారు.
కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివ, ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ పైడిపాముల స్వప్న, కో-ఆప్షన్ సభ్యులు షేక్ నబీఘోరీ, వార్డ్ సభ్యులు అంబటి భువనేశ్వరరావు, షేక్ సిలార్, ఏఎంసీ డైరెక్టర్ ఇబ్రహీం, తాతా ప్రదీప్, నర్రా చిన్ని, మహమ్మద్ యూనుస్, మహబూబ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
