స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ కార్యక్రమంలో మాజీ ఉప మేయర్…
పాయకాపురం, ఆంధ్రప్రభ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ కార్యక్రమంలో వీఎంసీ మాజీ ఉప మేయర్ అవుతు శ్రీశైలజశ్రీనివాసరెడ్డి పాల్గొని సర్ కార్యక్రమం ఉద్దేశ్యం బి. ఎల్.ఓ, బిఎల్. ఏ లకు వివరించారు.విజయవాడ సెంట్రల్లోని 58వ డివిజన్లో 41, 44 ,45 బూతులలో ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన ప్రతి పౌరుడుకి ఓటరుగా నమోదు కావాలని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అవుతు శ్రీనివాస రెడ్డి, స్థానిక బూత్ లెవెల్ ఏజెంట్ శ్రీలక్ష్మి, శ్రీనివాస్, మహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.వైసీపీనాయకులు ఇంటింటికీ తిరిగి ప్రజలలో ఓటర్ గొప్పతనాన్ని గురించి అవగాహన కల్పించారు.ఒక్క ఓటు కూడా వృథా కాకూడదు, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు కలిగి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
