భవన నిర్మాణ కార్మికుడు విద్యుత్ షాక్‌తో మృతి

భవన నిర్మాణ కార్మికుడు విద్యుత్ షాక్‌తో మృతి
విస్సన్నపేట, ఆంధ్రప్రభ : స్థానిక నూజివీడు రోడ్డులో గల బీజేఆర్ నగర్ కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు జొన్నలగడ్డ ఏసురత్నం విద్యుత్ షాక్‌తో మృతి చెందారు.
ఈ సందర్భంగా ఆదివారం ఉదయం బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం ఏసురత్నం స్నేహితుడు నూతన భవనం పనుల నిమిత్తమై ఆదివారం ఉదయం వెళ్లడం జరిగిందని, ఇంటి పైన 11 కెవి విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు కుటుంబీకులు తెలిపారు.
