Rs.50 thousand | ఆర్థిక సహయం

Rs.50 thousand | ఆర్థిక సహయం
Rs. 50 thousand | హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొత్తూరు యుగేందర్ ఇటువల మృతిచెందారు. యుగేందర్ మృతితో అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి విషమించింది. ఈసమాచారంతో మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గాజు కృష్ణవేణి యుగేందర్ యాదవ్, కొత్తపల్లి గ్రామ సర్పంచ్ దండ్రి సాంబయ్యల ఆధ్వర్యంలో, రెండు గ్రామాల యువకులు, యువజన సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి సంయుక్తంగా సేకరించిన రూ. 50 వేలను, ఆర్థిక సహాయంగా కుటుంబ సభ్యులకు అందజేశారు.
తమకు ఆర్థిక సహయం అందించడానికి కృషిచేసిన రెండు గ్రామాల సర్పంచులు, యువకులు, నాయకులకు మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో రెండు గ్రామాల సర్పంచులతో పాటు యువకులు దార రాకేష్, ఇజ్జిగిరి సాంబశివుడు, కొడారి నరేష్, ఆరెపల్లి రాజులు పాల్గొన్నారు.
