feb14th | ఒకే రంగు చీరల్లో మహిళాఎమ్మెల్యేలు.. సీఎం ఆశ్చర్యం
feb14th | ఒకే రంగు చీరల్లో మహిళాఎమ్మెల్యేలు.. సీఎం ఆశ్చర్యం
అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సందడి
సీఎం చంద్రబాబు నాయుడితో గ్రూప్ ఫోటో
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సరదా క్షణాలు
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళ మాధవి పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న అసెంబ్లీ ఫొటోలు
feb14th | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ ; అసెంబ్లీలో శుక్రవారం మహిళా ఎమ్మెల్యేలు సందడి చేశారు. అందరూ ముందుగానే ఒక మాట అనుకున్నట్లుంది..శుక్రవారం సమావేశం ముగిశాక సీఎం చంద్రబాబు నాయుడు ఛాంబర్ కు వెళ్లారు. ఒకే రంగు దుస్తుల్లో మహిళా మణులంతా రావడం ఆయన్ని ఆశ్చర్యపరిచింది.. వెళ్లిన ఎమ్మెల్యేలు సీఎం ను ఫోటో ప్లీజ్ సర్ అని అడిగడంతో వాళ్ళతో సరదాగా సంభాషిస్తూ ఫోటోలు దిగారు. అటునుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు కూడా వెళ్ళి గ్రూప్ ఫోటో దిగారు. శనివారం అసెంబ్లీ సమావేశాలకు సెలవు కావడంతో వెనక్కి వచ్చిన ఎమ్మెల్యేలు తీరుగా ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళ మాధవి విడుదల చేసిన ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.



