TG | రోడ్డు ప్రమాదంలో రఘునాథపల్లి మండలం వాసి మృతి..

TG | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : కుక్కలు అడ్డు రావడంతో బైక్ పై నుండి పడి రఘునాథపల్లి మండలంకు చెందిన మహిళా మృతి చెందింది. వివరాల ప్రకారం పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలో చోటు చేసుకుంది. రఘునాథపల్లి మండలం రామన్న గూడెం కు చెందిన భార్యభర్తలు యెంపాల బాల్ రెడ్డి, యెంపాల పూలమ్మ ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తుండగా కుక్కలు అడ్డు రావడంతో అదుపు తప్పి కింద పడటంతో పూలమ్మ (55) తలకు తీవ్ర గాయమయింది. స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో ప్రమాద స్థలానికి చేరుకొని డాక్టర్లు పరిశీలించి ఆమె అప్పటికే మృతి చెందినదని దృవీకరించారని బంధువులు తెలిపారు.
