ఎన్టీఆర్ జిల్లాలో విషాదం..

ఎన్టీఆర్ జిల్లాలో విషాదం..
కరువు పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి..
విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో కుప్పకూలిన ఉద్యోగి..
పెద్దమోదుగుపల్లిలో ఘటనతో విషాద ఛాయలు..
వత్సవాయి, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా, వత్సవాయి మండలం పెద్దమోదుగుపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరువు పనుల పర్యవేక్షణలో భాగంగా ఫీల్డ్‌లో నిర్వహిస్తున్న పనుల ఫోటోలను అధికారిక యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్న సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ బి. నరసింహారావు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సహచర సిబ్బంది గమనించి వెంటనే అప్రమత్తమై హుటాహుటిన జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఉండగానే నరసింహారావు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సహచర ఉద్యోగులు, గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
