బెల్లంపల్లి 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత ప్రచార ప్రభంజనం
బెల్లంపల్లి 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత ప్రచార ప్రభంజనం
హస్తం గుర్తుకే పట్టం కడతామంటున్న ఓటర్లు!
గడపగడపనా వసంతకు నీరాజనాలు..
భారీ మెజార్టీతో గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్థిని
(బెల్లంపల్లి – ఆంధ్రప్రభ): బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, 15వ వార్డులో రాజకీయ వాతావరణం పూర్తిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోంది. ఈ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థినిగా బరిలో ఉన్న చింతల వసంతకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. వార్డులోని ప్రతి గల్లీలోనూ కాంగ్రెస్ కే ఓటేస్తాం వసంతక్కను భారీ మెజార్టీతో గెలుపించుకుంటామంటూ ఓటర్లు పేర్కొంటున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆశీస్సులతో, అభివృద్ధిని ప్రధాన అజెండాగా మార్చుకుని ఆమె సాగిస్తున్న ప్రచారం ఓటర్లను ఆకర్షిస్తోంది. 15వ వార్డులో మొత్తం 1,273 మంది ఓటర్లు ఉండగా, అందులో మెజార్టీ ఓటర్లు ఇప్పటికే హస్తం గుర్తుకే తమ మద్దతును బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ప్రచారంలో భాగంగా వసంత ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఆమెకు హారతులు పట్టి, తిలకం దిద్ది ఘన స్వాగతం పలుకుతున్నారు.
“అందరి నోటా వసంతమ్మకు ఓటేస్తాం” అనే నినాదం వార్డులో మార్మోగుతోంది. వార్డు ప్రజలతో ఆమెకు ఉన్న అనుబంధం, నిరంతరం అందుబాటులో ఉండే తత్వం ఆమెకు భారీ మెజార్టీని తెచ్చిపెడతాయని స్థానిక విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 15వ వార్డులో కాంగ్రెస్ నుండి అత్యధికంగా ఏడుగురు ఆశావహులు నామినేషన్లు వేసినప్పటికీ, ఇప్పుడు వసంత నేతృత్వంలో పార్టీ శ్రేణులన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి ఒక్కొక్కరు బరిలో ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఈ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంతకు వస్తున్న ఆదరణ చూస్తుంటే పోటీ ఏకపక్షంగానే కనిపిస్తోంది. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్‌లో వసంత రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఆమె మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల కల్పనపై వసంత స్పష్టమైన హామీలు ఇస్తున్నారు. తాను గెలిచిన వెంటనే 15వ వార్డును మున్సిపాలిటీలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఆమె ఓటర్లకు మాటిస్తున్నారు.15వ వార్డులో మాత్రం హస్తం జెండా రెపరెపలాడటం ఖాయమని ప్రచార సరళిని బట్టి అర్థమవుతోంది.
