వచ్చే ఏడాది విద్యార్థుల సంఖ్య పెంచాలి…

వచ్చే ఏడాది విద్యార్థుల సంఖ్య పెంచాలి…

జన్నారం,ఆంధ్రప్రభ: వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను 10 శాతం పెంచాలని జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్లు సూచించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల విద్యావనరుల కేంద్రాన్ని( ఎంఆర్సీ) జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్లు భరత్ కుమార్, కృష్ణమూర్తి, సత్తయ్య, విజయలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రోగ్రెషన్ యాక్టివిటీని త్వరగా పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎన్.విజయ్ కుమార్,ఎంఐఎస్ కోఆర్డినేటర్ వెంకటేష్,సీఆర్పీలు నీలం శేఖర్, బుచ్చన్న, దయాకర్, శివకుమార్, రవి, మెసెంజర్ విజయ్ పాల్గొన్నారు.