సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ భూమి పూజ

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పానాపటార్ గ్రామ పంచాయతీలోని నాగోబాగూడలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన అంతర్గత సిసి రోడ్డు నిర్మాణానికి మంగళవారం పానాపటార్ సర్పంచ్ ఆత్రం తులసి శంకర్ భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ఆదేశాల మేరకు నాలుగు లక్షలతో సిసి రోడ్ నిర్మించడం జరుగుతుందని రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో పానపటార్ ఉపసర్పంచ్ ఆత్రం భీంరావ్, పంచాయతీ కార్యదర్శి జాడి.కైలాష్ గ్రామస్థులు మడావి ముత్తు,జంగుబాయి,విష్ణు,లక్ష్మణ్,దత్తారాం,రాము శంకర్ కొలాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply