సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రచారం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 4 వ వాటి నుండి సిపిఐ( ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి ని గెలిపించాలని కోరుతూ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ శనివారం పాల్గొన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడే సిపిఎం పార్టీకి అండగా నిలవాలని ఓటర్లను కోరారు. ఇంటి ఇంటి ప్రచారం, ర్యాలీ,కాటమయ్య బజార్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో వెస్లీ ప్రసంగించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటి సభ్యులు,ఎంఏ ఇక్బాల్, బొలగాని జయరాములు, నాయకులు మోరీగాడి రమేష్, సిపిఎం మండల కార్యదర్శి ధూపటి వెంకటేష్,వడ్డేమాన్ బాలరాజు, గనగాని మల్లేష్, నల్ల మాస తులసయ్య సంగీ రాజు,తాళ్లపల్లి గణేష్,బొప్పిడి యాదగిరి ,చెన్న రాజేష్, కాసుల నరేష్, మోరిగాడి రాజు, లక్ష్మణ్,అశోక్, అంజయ్య,యాసరపు ప్రసాద్, గొడుగు దాసు,ఎండి మతిన్, ఎండి ఖలీల్, ఎండి అమీర్, మొరిగాడి పుష్ప,స్వరూప, చంద్రకళ,ఐలి అంజమ్మ, మొరిగాడి అనిత,వాలి, చౌడబోయిన యాదగిరి పాల్గొన్నారు.
