జీఆర్పీఎస్ లో వందేమాతరం సామూహిక గీతాలాపన

జీఆర్పీఎస్ లో వందేమాతరం సామూహిక గీతాలాపన

కరీమాబాద్, నవంబర్ 7 (ఆంధ్రప్రభ) : వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరంగల్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ (Warangal GRP Police Station) లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వందేమాతరం గీత రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రాల్లో వందేమాతరం గీతం ఆలపించారు.

ఈ కార్యక్రమంలో ఇన్ స్పెక్టర్ పి.సురేందర్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్స్ ఎన్ రవీందర్, కే.భాస్కర్, కానిస్టేబుల్స్ బి.భాస్కర్, రాము, రామారావు కమలాకర్, రాజు, ఉమెన్ కానిస్టేబుల్స్ సుమలత, ప్రశాంతి అందరూ మూక్కుమ్మడిగా కలిసి వందేమాతర గీతం ఆలపించారు.

Leave a Reply