Strike | దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

Strike | దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

  • సమ్మెను జయప్రదం చేయాలని కల్లూరు లోని పోస్టర్ ల విడుదల

Strike | కుంటాల, ఆంధ్రప్రభ : ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం కుంటాల మండలంలోని కల్లూరు లోని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా టి యు సి ఐ అధ్యక్ష కార్యదర్శులు ఏం బక్కన్న ఆర్ రామ్ లక్ష్మణ్ లు మాట్లాడుతూ…. ఈనెల 12 దేశాలతో సమ్మెను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా కార్పొరేట్లకు దేశ సంపాదన కార్యవర్గ శ్రమను కేంద్రం మోడీ ప్రభుత్వం దోచుపెడుతుందని వీడి పరిశ్రమ నాశనానికి జీఎస్టీ విధిస్తుందని విమర్శించారు. బీడీ కార్మికులను నష్టం చేసే విధంగా చట్టాన్ని రద్దు చేయాలని కనీస పెన్షన్ 9000 ఇవ్వాలని బీడీ పరిశ్రమలు పనిచేసే కార్మికులందరికీ షరతులు లేవని జీవన వృత్తి అమలు చేయాలని, కార్మిక చట్టాలను ప్రతిష్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.