వార్డులోని సమస్యలను పరిష్కరిస్తా

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మున్సిపాలిటీలోని 28 వార్డులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి గడిపే చక్రపాణి వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. వార్డులోని సమస్యలను పరిష్కరించాలంటే అవగాహన ఉండే నాయకులు కావాలని అన్నారు. వార్డులో పోటీ చేసే అభ్యర్థులకు కనీస అవగాహన లేదని అన్నారు. వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నిటిని ప్రజల సహకారంతో పరిష్కరిస్తానని తెలిపారు.
