జైనూర్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమురం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివారం వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జైనూర్ ఆర్యవైశ్య సంఘం తరపున పూజ లు చేసి మొ క్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు జన్న వార్ పవన్ కుమార్, అశోక్ మాట్లాడుతూ వాసవి మాత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వాసవి మాతా ఆశీస్సులులు అందరి మీద ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.