Congress | ఎమ్మెల్యే సమక్షంలో…

Congress | ఎమ్మెల్యే సమక్షంలో…
- కాంగ్రెస్ లో చేరిన సర్పంచులు
Congress | జన్నారంరూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మోర్రిగూడ, వెంకటాపూర్ సర్పంచులు, ఉప సర్పంచులు తాళ్లపల్లి విజయ- లచ్చన్న,ఆత్రం సోంబాయి బాదేరావు, మెస్రం రాజ్ కుమార్, సీపెల్లి రాజన్నలు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఉట్నూర్ లోని క్యాంపు కార్యాలయంలో వారందరికీ ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బి.సుధాకర్ నాయక్, నేత తాళ్లపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
